హైదరాబాద్‌ వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో మంటలు

న్యూఢీల్లీ: దేశరాజధాని నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌ -8 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చైన్‌లాగారు. దీంతో రైలున నాగ్‌పూర్‌ దాటిన తర్వాత నిలిపి వేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వేసిబ్బంది అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పించేశారు. అనంతరం రైలును నాగ్‌పూర్‌కు తీసుకువెళ్లి బోగీని మార్చి హైదరాబాద్‌కు తరలించనున్నారు.