అంగనివాడి కేంద్రాల్లో పోషక వారోత్సవాలు
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 08 (జనం సాక్షి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని బందరిగూడెం అంగన్వాడీ సెంటర్ నందు పోషక వారోత్సవాల సందర్భంగా హాజరైన సీడీపీఓ జయలక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటి ఆహారపదార్థాలతో పాటు పాలు, గుడ్లు, పండ్లు,ఆకు కూరలు, చేపలు, మాంసం తినడం వల్ల పుట్టబోయే బిడ్డలు మంచి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.తల్లులు ఎప్పటిఅప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించికుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి,మనం నివసించే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగాఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ సరోజిని , అంగన్వాడీ టీచర్ కె కుమారి, ఎ ఎన్ ఎం, ఆశ వర్కర్లు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.