Thursday, 5 November 2026

విద్యుత్ సమస్యలపై వినతిపత్రం

 

సెప్టెంబర్ 8, బోనకల్ (జనంసాక్షి):
బోనకల్ గ్రామంలో గతకొంతకాలంగా విద్యుత్ సమస్యలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నందున గ్రామంలోని అఖిలపక్ష నాయకులు విద్యుత్ ఏ.ఇ ఉమామహేశ్వరరావు గారిని కలిసి గ్రామంలోని లోవోల్టేజ్ సమస్యని పరిష్కరించాలని అదేవిధంగా మిడిల్ పోల్స్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు విద్యుత్ సౌకర్యాలను కల్పించాలని డమేజ్డ్ పోల్స్ ని మార్చాలని గ్రామంలో కరెంట్ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇట్టి విషయమై సానుకూలంగా స్పందించిన ఏ. ఇ గారు నెల రోజులలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తామని వారం రోజులలో గ్రామం మొత్తం పర్యటించి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి కృషిచేస్తామని తెలియచేసారు ఈ కార్యక్రమంలో సి.పి.ఎమ్ గ్రామ శాఖ కార్యదర్శి తెల్లకుల శ్రీనివాసరావు, బి.జె.పి జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోత్ నాగేశ్వరరావు,ఎమ్.పి.టి.సి గుగులోత్ రమేష్, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ గౌడ్ పాల్గొన్నారు.