అంగరంగ వైభవంగా సామూహిక జనగణమన

గుండాల, ఆగస్టు16(జనంసాక్షి);గుండాల మండలంలో స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా ఉదయం 11:30 గంటలకు అధికారులు,మరియు ప్రజలు గాంధీ విగ్రహం దగ్గర జెండా ఎగురవేసి సామూహిక జనగణమన ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నాగదివ్య, ఎంపీపీ ముక్తి సత్యం ,గుండాల సీఐ కరుణాకర్,ఫారెస్ట్ రేంజర్ మురళి,ఎస్సై రాజశేఖర్, ఎంపీడీఓ సత్యనారాయణ,ఎంపీ ఓ హాజరత్ వలి, సర్పంచ్ సీతారాములు,ఎంపీటీసీ సంధాని,డాక్టర్ రవిచంద్,పోలీస్ సిబ్బంది,పంచాయతీ సిబ్బంది,వివేకావర్ధిని ప్రిన్సిపాల్ వరలక్ష్మి,ప్రగతి విద్యాలయం విద్యార్థులు,రెవెన్యూ సిబ్బంది, అటవీశాఖ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.