.
– మాజీ మంత్రి కొండా సురేఖ
వరంగల్ ఈస్ట్, మార్చి 18 (జనం సాక్షి)అందరికీ తాను ఎల్లవేళలా అండగా ఉంటానని తనను ఆశీర్వదించాలని తిరిగి ఎమ్మెల్యేగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లో భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి కొండా సురేఖ వేడుకున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో శనివారం సురేఖ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి షాప్ కు వెళ్లి, ప్రతి వ్యాపార సంస్థకు వెళ్లి, ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రతి ఒక్క ఓటరు చేయి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ను బలపరచాలని కోరారు. పేద బడుగు బలహీన వర్గాల బతుకులు మారాలన్న వారు ఆర్థికంగా అన్ని విధాలుగా ఎదగాలన్న కాంగ్రెస్ పార్టీకి చేయూతనివ్వాలని సురేఖ చెప్పారు. ప్రజలు శాంతియుతంగా బతకాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాష్, నల్గొండ రమేష్, చిప్ప వెంకటేశ్వర్లు, మడిపల్లి కృష్ణ, సదానందం తోపాటు కురిమిళ్ళ సంపత్, ప్రకాష్, చెన్నమల్లు, సత్యం, బత్తుల వినోద్, రాజేష్, షేర్ల కిషోర్, వసీం, శ్రీనివాస్, మురళి, స్వప్న, పుష్ప, శివ తదితరులు పాల్గొన్నారు.




