Tuesday, 3 November 2026

అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా పాఠశాల అభివృద్ధి

మంత్రి పద్మారావు

హైదరాబాద్‌,జూలై2(జ‌నం సాక్షి): హకీంపేట క్రీడా పాఠశాలలో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తానని క్రీడల శాఖ మంత్రి పద్మారావు అన్నారు. ఇక్కడి ట క్రీడా పాఠశాలలో రూ.1.80కోట్లతో ఇండోర్‌ స్టేడియాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహదారుడు బీవీ పాపారావు, ప్రభుత్వ కార్యదర్శి బి. వెంకటేశం, తెలంగాణ శాట్స్‌ (ఎస్‌ఏటీఏస్‌) ఛైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ దినకర్‌ బాబు, ఎంపీ మల్లారెడ్డి, మేడ్చల్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ ఏంవి రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.