|
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు మార్చి 6(జనం సాక్షి)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చి 8వ తేదీన పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్న మహిళా దినోత్సవ వేడుకలకు రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటూ మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి లు హాజరువుతారని పేర్కొన్నారు.
|




