(జనం సాక్షి)
వికరాబాద్ జిల్లా మోమిన్ పేట నుండి బ్రతుకుదెరువు నిమిత్తం10 సంవత్సరాల క్రితం హత్నూర మండలానికి వచ్చి దౌల్తాబాద్ పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సువర్ణ (40) తీవ్ర అనారోగ్యానికి గురై ఆదివారం రాత్రి మృతి చెందారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతురాలి భర్త కోటయ్య వద్ద చిల్లిగవ్వ లేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు.సమాచారం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ దౌల్తాబాద్ గ్రామ అధ్యక్షుడు అజ్మత్ అలీ అక్కడికి చేరుకుని సువర్ణ అంత్యక్రియల కోసం కోటయ్యకు రూ.5వేలు ఆర్థిక సహాయం అందించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు




