అందరు ఉన్న అనాధ శవానికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్ సుష్మ గౌడ్

దంతాలపల్లి ఆగస్టు 9 జనంసాక్షి

అందరు ఉన్న అనాధ శవానికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు మండలంలోని బొడ్లాడ గ్రామ సర్పంచ్ మండ సుష్మా గౌడ్ వివరాల్లోకి వెళితే స్థానిక ఎస్సై కే జగదీష్ కథనం ప్రకారం మంగళవారం ఉదయం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో
హుటాహుటిన తన సిబ్బందిని పంపించి మృతుని వివరాలు సేకరించగా మండలంలోని
బొడ్లాడ గ్రామానికి చెందిన ఎర్రం బాలమల్లు(60) గా గుర్తించి తన రక్తసంబంధికులకు సమాచారం అందించగా అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాకపోవడంతో స్పందించిన గ్రామ సర్పంచ్ మండా సుష్మా గౌడ్ తన సొంత ఖర్చులతో నూతన వస్త్రాలు పూలమాలవేసి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు కాగా కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రెడ్డి కానిస్టేబుల్ మధు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ రెండు గ్రామాల సిబ్బంది దర్శనాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.