Wednesday, 4 November 2026

అందరు మొక్కలు నాటాలి – విషవాయువును నిర్మూలిద్దాం ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదిద్దాం

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఆగస్టు 8 :–. హరిత తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ అన్నారు మంగళవారం 25వ డివిజన్ పరిధిలో గల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన కార్యాలయం వద్ద కార్పొరేటర్ జమాల్పూర్ నవీన్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ విశవాయులను ఆస్వాదిస్తూ అనారోగ్యాల పాలవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటి బాధ్యతగా నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగేంతవరకు పెంచి ఆ వృక్షాలు ఇచ్చే ప్రకృతి పరమైన స్వచ్ఛమైన వాయువును ఆస్వాదిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాల్సిన అవసరం ఎంత ఉందని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం కోసం వృక్ష సంపద ఎంతో అవసరమని సూచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు కార్యకర్తలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు