కొత్తగూడెం,సెప్టెంబర్9(జనంసాక్షి): అశ్వారావుపేట వీకేడీవీఎస్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం నిర్వహించిన స్వాగత వేడుకలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మేనేజర్ దుర్గాప్రసాద్, ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త ఉష ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కళాశాలలు స్నేహానికి నిలయంగా మారాలని సూచించారు. కళాశాలలోకి అడుగుపెట్టేరోజు వద్దని మారాం చేసిన వారే కళాశాల విడిచి వెళ్లేరోజు కన్నీళ్లు పెట్టుకుంటారన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో సర్పంచి సత్యవతి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు టి.రవికుమార్, ప్రిన్సిపల్ శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.




