అంబేద్కర్ ఆశయాలను సాధించాలి – కోల్లపూడి యోహాన్ శ

హుజూర్ నగర్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని హుజూర్ నగర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోల్లపూడి యోహాన్ అన్నారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశం కోసం అహర్నిశలు కృషిచేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కుల రహిత భేదాలు లేకుండా స్త్రీలు, పురుషులు అందరూ సమానులేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పేదవాడు చదువుకోవాలని, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ప్రతి విషయంలో ఎంతో క్షుణ్ణంగా భారత రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. ఇలాంటి గొప్ప మహనీయుడు వర్ధంతి, జయంతి వేడుకలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో సెలవు దినముగా ప్రకటించి అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి వర్ధంతి, జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.