అంబేద్కర్.. రాజ్యాంగం సృష్టికర్త
ఎమ్మెల్యే బాలకిషన్.
శంకరపట్నం: జనం సాక్షి డిసెంబర్ 4
యావత్ భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజానీకానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేవుడని,
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారధి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ దాసారపు భద్రయ్య అధ్యక్షతన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక్క కులానికి చెందినవాడు కాదని, ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు ఉండేలా ఆనాటి అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన, త్యాగ ఫలాలే నేడు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారని, నేటి భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ పొందుపరిచిన రిజర్వేషన్ ఫలితాలను యావత్ భారత దేశంలోనే అన్ని వర్గాల ప్రజలు పొందుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ పొందుపరిచిన పలాలను అనుభవిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యలు చదివి, నేను కూడా అనేక కష్టనష్టాలను ఎదుర్కొని, ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ పొంది, గోల్డ్ మెడల్ డాక్టర్ రేటును, ఉన్నత చదువులతో పొందానని, కల్వల గ్రామం ని తను రెండోసారి ఎమ్మెల్యేగా ఐ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టినట్లు నూతన గ్రామపంచాయతీ గా ఏర్పాటుచేసి, ప్రత్యేక నిధులు విడుదల చేస్తూ, గ్రామ ప్రజల యువత కోరిక మేరకు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం అభినందనీయమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వము పేద కుటుంబాలకు ఉన్నత చదువులు అందించేందుకు 25 లక్షల రూపాయలను ఉన్నత విద్య అభ్యాసం కోసం మానకొండూర్ నియోజకవర్గంలో 23 మంది పేద వాళ్లకు చెందిన విద్యార్థులను లండన్‌కు పంపించినట్లు చెప్పారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ ఉమ్మెoతల సరోజన ,వైస్ ఎంపీపీ పులికోట రమేష్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, ఎంపిటిసిల పూర్ మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి, వీణవంక మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, సర్పంచులు రాజయ్య, రజిత, మానస, దళిత సంఘాల నాయకులు, రవి, కిష్టయ్య, శంకర్ర్, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
అంబేద్కర్.. రాజ్యాంగం సృష్టికర్త




