అకాల మరణం పొందిన సర్పంచ్ బాపిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రసమయి.

బెజ్జంకి,అక్టోబర్12,(జనం సాక్షి):మండల కేంద్రంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ పెండ్యాల బాబు రెడ్డి ఆదివారం అకాల మరణం చెందారు.మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారంలో ఉన్న రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ఈ ఆకాల మరణం వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సోమవారం లక్ష్మీపూర్ గ్రామానికి విచ్చేసి సర్పంచ్ పెండ్యాల బాపిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం రసమయి మాట్లాడుతూ బాపురెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించారు.గ్రామ అభ్యున్నతికి పార్టీ బలోపేతానికి బాపిరెడ్డి చేసిన సేవలు మరువలేనివని అన్నారు.ఆనంతరం మండల కేంద్రములో ఆయిలేని కిరణ్ రెడ్డి మరియు పెరక బండ గ్రామానికి చెందిన చెట్లపెల్లి శేఖర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వీరితో మండల కో ఆప్షన్ సభ్యులు, తెరాస మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,తెరాస రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా,తెరాస సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్,కనగండ్ల తిరుపతి,సర్పంచ్లు చింతల పల్లి నుంచి సంజీవ రెడ్డి,టేకు తిరుపతి,కనగండ్లరాజేశం,కర్రావుల సరోజన మల్లేశం,తెరాస సోషల్ మీడియా ఇంఛార్జి ఎల శేఖర్ బాబు,తెరాస మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,నాయకులు ముక్కీస తిరుపతి రెడ్డి,ఎలుక దేవయ్య,చెట్టి రాజు,నలువల స్వామి తదితరులు పాల్గొన్నారు.