*అకాల వర్షాలకు పడిపోయిన పంట పొలాలను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి*

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.మండలంలోని దిర్షించర్ల,రోళ్ళవారి గూడెం బక్కయ్య గూడెం పలు గ్రామాలలో,మండల బిజెపి అధ్యక్షులు పార్థన బోయిన విజయ్ కుమార్,కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం,అకాల వర్షాలకు పడిపోయిన పంట పొలాలను సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి  సందర్శించారు.అనంతరం నేరేడుచర్ల పార్టీ  కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఎకౌంట్లో 12వ విడత 2000 రూపాయలు వేస్తున్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షులు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొత్తూరు వెంకటేశ్వర్లు,అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్,మండల ఉపాధ్యక్షుడు వీరబాబు,పట్టణ ఉపాధ్యక్షులు ఉరిమిల్ల రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి పగిడి శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొణతం నాగిరెడ్డి,సీనియర్ నాయకులు బైరెడ్డి బక్కిరెడ్డి,రాజేష్ రెడ్డి, మండల పట్టణ కిసాన్ మోర్చ అధ్యక్షులు పర్శనబోయిన సత్యం, తాళ్ళ నరేందర్ రెడ్డి,ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు చింతలచేర్వు సతీష్, గ్రామ పార్టీ అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీను, పత్తేపురం వెంకటేష్,యడవెల్లి సైదిరెడ్డీ, పంగ వెంకటేశ్వర్లు పంగ వెంకన్న, మండల సోషల్ మీడియా కో కన్వీనర్ నన్నేపంగ ప్రశాంత్,యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.