అకాల వర్షాల వల్ల ఇల్లు కూలిన బాధితులను ఆదుకుంటాం.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశం సారం మండల వ్యాప్తంగా విస్తృత పర్యటన.
ప్రజాసేవకు ప్రథమ ప్రాధాన్యం
నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది.
మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్.
తాండూరు జులై 22(జనంసాక్షి)ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశానుసారం ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇల్లు కూలిన బాధితులను మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఎంపీపీ బాలేశ్వర గుప్తా సీనియర్ నాయకులు మండల పరిధిలో విస్తృతంగా పర్యటించి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశానుసారం మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇల్లు కూలిన నిరుపేదలను పరామర్శించి
మనో ధైర్యాన్ని కల్పించారు.ఇల్లు కూలిన నిరుపేదల వివరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే బాధితులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లు కూలిన బాధితులను పరామర్శించే క్రమంలో బానాపూర్ గ్రామంలో వార్త్యా శంకర్ నాయక్ కు సంబంధించిన కూలిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారిలో మనో ధైర్యాన్ని నింపి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్, అచ్యుతాపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, దేవనూర్ సర్పంచ్ ఆకుల శివకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆశన్న, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కృష్ణకుమార్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, బిఆర్ఎస్ మండల రైతు సంఘం అధ్యక్షులు అరవింద్ కుమార్ రెడ్డి, సాయిలు, ముద్దాయి పేట శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.