తండ్రిగా గర్వపడుతున్నానన్న నాగార్జున
హైదరాబాద్,మే10(జనం సాక్షి): అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం బుధవారం విడుదలై ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరి మన్ననలను పొందుతోంది. ఈ చిత్రంలో ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తున్నారో వెల్లడిస్తూ ఒక్కో సెలబ్రిటీ సోషల్‌విూడియా వేదికగా వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇందులో ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్‌బాబు, జెమిని గణెళిశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, దర్శకులు కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్ పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి, అవసరాల శ్రీనివాస్, జెమిని గణెళిశన్ మొదటి భార్య అలిమేలు పాత్రలో మాళవికా నాయర్‌లు నటించారు.
తాజాగా అక్కినేని నాగార్జున ఓ సర్‌ప్రైజ్ వీడియో విడుదల చేశారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో తన కుమారుడు నాగచైతన్య నటించినట్లు వెల్లడిస్తూ వీడియో పోస్ట్ చేశారు. ‘రామాపురం అనే చిన్న ప్లలెటూరు. పేద రైతు కుటుంబం. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేక వ్యవసాయం చేసుకుంటూ నటన విూద వ్యామోహంతో స్త్రీ పాత్రలు వేస్తున్న 15 ఏళ్ల కుర్రాడు. ఘంటశాల బలరామయ్య అనే నిర్మాత దృష్టిలో పడి ‘ధర్మపత్ని’ అనే సినిమాలో తళుక్కున మెరిశారు. ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావుగారు. ఏఎన్నార్ గారి సరసన ఎంతో మంది నటించినా.. ఏఎన్నార్, సావిత్రి జంటగా చేసిన చిత్రాలన్నీ చరిత్రలోనే నిలిచిపోయాయి. కాసుల వర్షాన్ని కురిపించాయి. ‘మాయాబజార్’, ‘దేవదాసు’, ‘మూగమనసులు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘ఆరాధాన’, ‘నవరాత్రి’ వంటి చిత్రాలు తెలుగు చిత్ర సీమ అనే కిరీటంలో వజ్రాలుగా పొదగబడ్డాయి. ఈనాటి ‘మహానటి’ చిత్రంలో ఆనాటి అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నది ఆయన మనవడు..అక్కినేని నాగచైతన్య.’ అని అంటూ ఎప్పటిలాగే నాని ఈ వీడియోకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తండ్రిగా గర్వపడుతున్నా. కొడుకుగా అసూయపడుతున్నా. మా నాన్న పాత్రలో నేనెప్పుడూ నటించలేదు. కానీ మా అబ్బాయి చైతూ నటించినందుకు గర్వపడుతున్నా’ అని పేర్కొన్నారు.
——




