హైదరాబాద్,సెప్టెంబర్18(జనంసాక్షి): జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఈ మేరకు ఉత్తర్వుఉల జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా.. ఫీజు చెల్లింపునకు ఈనెల 14వ తేదీ, దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం 5.69 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు నియామక పక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ వారం క్రితం ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




