గద్వాల, అక్రమబదిలీలు ఆపాలంటు శనివారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంవద్ద యుపిఎస్‌సి, జాక్టో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు సాదారణంగా బదిలీలు చేస్తామని చెప్పిన పైరవీలకు స్థానం కల్పిస్తు అక్రమంగా బదిలిలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి తావీయకుండా బదిలీలు జరగాలని ముఖ్యమంత్రి చెప్పగా ఆయన కార్యాలయంలోనే పైరవీలు కోనసాగుతున్నాయని ఆరోపించారు. పట్టణప్రాంతాలలో గల ఖాళీలను ముందుగానే భర్తీ చేస్తే ఇతరప్రాంతాలలో సాదారణంగా జరిగే బదిలీల గురించి ఎవరికి చెప్పుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేసిన పైరవీ బదిలీలను వెంటనే ఆపాలని వారు డిమాండ్‌చేశారు. ఈమేరకు డిఇఓకు, ప్రత్యేక ముఖ్యకార్యదర్శికి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనిస్‌పాష, గోపాల్, హరిబాబు, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణగౌడు, తిమ్మప్ప తదితరులు పాల్గోన్నారు.




