అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

జహీరాబాద్ సెప్టెంబర్ 1( జనంసాక్షి) అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అని పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షుడు సురేష్ అన్నారు.లింగంపల్లి గురుకులంలో కరెంట్ షాక్ తో విద్యార్థి మృతి కారణమైన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి అని ఆస్పత్రి ముందు నిరసన చేస్తున్న పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు సురేష్ నాయకులను అరెస్టు చేశారు.పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. సురేష్ డిమాండ్ మాట్లాడుతూ జహిరాబాద్ ప్రాంతం లో విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ సురభి చైతన్య పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. శాంతియుత నిరసన తెలిపి , విద్యార్థి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేయడమే నేరంగా భావించిన జిల్లా పోలీస్ యంత్రాంగం వ్యవహరించడం అధికార దుర్వినియోగం తప్ప మరెందుకు ఉపయోగపడదని స్పష్టం చేశారు.