*అక్రమ అరెస్టు లతో విఆర్ఏ ల ఉద్యమం ఆపలేరు.

చిట్యాల 11(జనంసాక్షి) అక్రమ అరెస్టులతో వీఆర్ఏల ఉద్యమం ఆపలేరని వీఆర్ఏల మండల అధ్యక్షులు బందెల ప్రేమ్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ కమిటీ పిలుపు మేరకు వీఆర్ఏ గర్జన హైదరాబాదు మహా సభకి తరలి వెళ్తుండగా మండల విఆర్ఏ లను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం ఈ సందర్భంగా విఆర్ఏ ల మండల జేఏసీ చైర్మన్ బందేల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులు వీఆర్ఏ ఉద్యమాన్ని ఆపలేరని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని,
వీఆర్ఏ లందరికీ పే స్కేల్, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని, లేనియెడల ఈ ఆందోళనలను రోజు రోజుకు ఉదృతం చేస్తామని ,ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే త్వరలో ప్రగతి భవన్ ముట్టడి చేసి ముఖ్యమంత్రికి నిరసన సెగ తగిలిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీకాంత్, సురేష్,రాజు, భద్రయ్య ,నరసయ్య ,సదయ్య, సదానందం, స్వామి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.