*అక్రమ అరెస్ట్ లతో వి ఆర్ ఏ ల ఉద్యమాన్ని ఆపలేరు.
చిట్యాల సెప్టెంబర్13 (జనంసాక్షి) అక్రమ అరెస్టులతో వీఆర్ఏల ఉద్యమాన్ని ఆపలేరని విఆర్ఏ మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి పే స్కేల్ హామీలు నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం హైదరాబాదులో జరగబోయే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మండలం లో వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో బయలుదేరగా మార్గ మధ్యలో అక్రమ అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు వీఆర్ఏల ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ అరెస్టులతోటి గృహనిర్బంధాలతోటి ఉద్యమాన్ని ఆపలేరని కచ్చితంగా ముఖ్యమంత్రి పే స్కేల్, వారసుల ఉద్యోగాలు, ప్రమోషన్ల సాధించేంతవరకు వీఆర్ఏ ఉద్యమం ఆగేది లేదన్నారు.ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏ జేఏసీ కన్వీనర్ లక్ష్మీకాంత్,రాజు, సురేష్, శ్రీనివాస్, భద్రయ్య ,నరసయ్య సదానందం,శంకర్, తదితరులు పాల్గొన్నారు.