Friday, 6 November 2026

అక్రమ కట్టడాలు.. చర్యలు ఎక్కడ ?

అల్వాల్ మున్సిపల్ పరిధిలో అనుమతులు లేకుండా
భవన నిర్మాణాలు..
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్ .. నిద్రమతలోఅధికారులు

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 18

అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ పంచశీల కాలనీ ప్రెసిడెన్సి కాలనీ ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు లో జోరుగా అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతుంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయారు. ఏ వీధిలో చూసిన రోడ్లను కబ్జా చేస్తూ.. పార్కింగ్ కు సెల్లార్లను వదిలేయకుండా బాల్కనీలను పెంచి బహుళ అంతస్తుల నిర్మిస్తున్నారు. అనుమతులు ఒకదానికి తీసుకుంటూ నిర్మాణాలు మరో విధంగా చేపడుతున్నారు. ఇంత జరుగుతున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మున్సిపల్ కమిషనర్లకు సూచించిన వారిలో కదలిక కనిపించడం లేదు. అల్వాల్ మున్సిపల్ కార్యాలయాలకె పరిమితం కావడంతో అక్రమ కట్టడాలు కొనసాగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలను గుర్తించాల్సింది పోయి తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. జిహెచ్ఎంసి పరిధిలోని ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం జి ప్లస్ త్రీ కె అనుమతి అని ప్రకటించిన అక్రమార్కులు 5 అంతస్తుల భవనం నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విధంగా తప్పుడు అనుమతులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిద్రమత్తులో తుంగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోనై మామూళ్లకు అలవాటు పడే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కొందరు పార్కింగ్ సెల్లార్ వదిలేయకుండా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి యదేచంగా అద్దెకు ఇచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరడ జులిపించాలని స్థానికులు కోరుతున్నారు…
కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం!
అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు కార్యాలయాలకి పరిమితమై అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదు. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై ప్రభుత్వానికి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం.
ఇరుగు రాళ్ల మురళి కృష్ణ
మేడ్చల్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు…
గమనిక: ఈ వార్త స్టోరీ లాగా రాయండి
Attachments area