Tuesday, 3 November 2026

అఖిల భారత విశ్వకర్మ మహాసభ జిల్లా అధ్యక్షులుగా : అయిళ్ళ సత్యనారాయణ చారి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )అఖిల భారత విశ్వకర్మ మహాసభ   జగిత్యాల జిల్లా అధ్యక్షులు అయిళ్ళ  సత్యనారాయణ చారి  (టి .వి సత్యం ) ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ చారి ఈ మేరకు   ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా  నా నీయమ్మకానికి సహకరించిన రాష్ట్ర నాయకులకి నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు నుండి సంఘ బాధ్యతలు చేపడుతూ జాతి కోసం నిరంతరం కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేసారు. . ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథ చారి మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధి కోసం అఖిల భారత విశ్వకర్మ మహాసభ వేదికగా తెలంగాణలో ఉన్న విశ్వకర్మలు అందరూ ఏకమై జాతి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు అశ్విన్ చారి  జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ , రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెన్నయ్య చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి గారు,రాష్ట్ర కోశాధికారి ఆవంచి మురళి , రాష్ట్ర సలహా దారుడు  బ్రహ్మ శ్రీ అద్దంకి  కృష్ణమాచారి   తదితరులు పాల్గొన్నారు .