హైదరాబాద్ : ఉదయం నల్లగొండలో.. సాయంత్రం మలక్‌పేటలో.. మలక్‌పేట సలీంనగర్‌లోని ఓ ఇంట్లో సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాలుగు నెలల చిన్నారితో సహా ఒకరు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.నల్లగొండ మండలం దోమలపల్లిలోని ఓ ఇంట్లో ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళ సజీవదహనమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




