హైదరాబాద్ : అసిఫ్‌నగర్ జిర్రా రోడ్డులోని పాత సామగ్రి గోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.




