Wednesday, 4 November 2026

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైసీపీ

– పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిల నియామకం
హైదరాబాద్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : ఏపీలో అగ్రిగోల్డ్‌ వ్యవహారం తీవ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇప్పటికే భాజపా, వామపక్ష పార్టీలు, వైసీపీలు అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని ఆందోళనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే తాజాగా అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైసీపీ ఆందోళనలను మరింత ఉదృతం చేసే పనిలో నిమగ్నమైంది.  ఈమేరకు వైసీపీ కాంగ్రెస్‌ పార్టీ.. ‘అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ’ పేరుతో పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇంచార్జ్‌ల పేర్లను తెలియజేస్తూ పార్టీ కేంద్రకార్యాలయం సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ కమిటీల ద్వారా ఆయా పార్లమెంట్‌
నియోజకవర్గాల్లో ఆందోళనలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం- దువ్వాడ శ్రీకాంత్‌, విజయనగరం- మజ్జి సుర్రప్పుడు, విశాఖపట్టణం – ఎం. కృష్ణరాజు, అనకాలపల్లి – జెర్రి పోతుల దుర్గరావు, అరకు – పెండ రమణ, కాకినాడ – పాపారాయుడు, అమలాపురం – కామేశ్వరరావు, రాజమండ్రి – బొంత శ్రీహరి, నరసాపురం – మేడపాటి సాయి చంద్రమౌళిశ్వర్‌రెడ్డి, ఏలూరు-  రావూరి వీర వెంకట సత్యదుర్గ ప్రసాద్‌, మచిలీపట్నం- కొఠారి శ్రీనివాస్‌, విజయవాడ- అడపా శేషు, నరసరావుపేట- మర్రిసుబ్బారెడ్డి,  గుంటూరు- వనమా బాల వజ్రబాబు (డైమండ్‌ బాబు), బాపట్ల- చేజార్ల నారయణ రెడ్డి, ఒంగోలు- సింగరాజు వెంకటరావు, నంద్యాల- కర్రా హర్షవర్దన్‌ రెడ్డి, కర్నూలు -రుద్ర గౌడ్‌, అనంతపురం- కొర్రపాడు హుస్సేన్‌ పీరా, హిందూపురం- పి. శంకర్‌ రెడ్డి, కడప- విజయ ప్రతాప్‌ రెడ్డి, నెల్లూరు-వేలూరు మహేష్‌, తిరుపతి- పెర్నాటి శ్యాంప్రసాద్‌ రెడ్డి, రాజంపేట- ఎ.గోవింద్‌, చిత్తూరు- టీవీ. శ్రీనివాసులు,