బెల్లంపల్లి, మార్చ్ 3, (జనంసాక్షి )
అచ్చేదిన్ తెస్తామని చెప్పి ప్రజలు సచ్చేదిన్ తెచ్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలో గ్యాస్ ధరల పెంపుకు నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. పేద ప్రజల నిత్యావసర వస్తువైన గ్యాస్ సిలిండర్ ధరను మరొక్కసారి భారీగా పెంచి పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తు కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహారిస్తుందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సముద్రాల వేణుగోపాల చారి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి పేద ప్రజల నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ పోతోందని, తద్వారా పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, కావున భారతదేశ ప్రజల ఇబ్బందులు తొలిగిపోవాలంటే రానున్న కాలంలో భారతదేశ ప్రజలందరూ ఏకమై ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆరెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, జనరల్ సెక్రెటరీ విజయ్, అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి, నాయకురాళ్లు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు …
అచ్చేదిన్ అని సచ్చేదిన్ తెచ్చిన బీజేపీ. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.




