అట్టహాసంగా నామినేషన్ దాఖలు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాల్క సుమన్
అట్టహాసంగా నామినేషన్ దాఖలు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాల్క సుమన్
చెన్నూర్ 9 నవంబర్ (జనం సాక్షి); నియోజకవర్గ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది. నామినేషన్ సమర్పించడానికి ముందు జగన్నాథ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అట్టహాసంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుల సమూహముతో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నియోజకవర్గంలోని నాయకులు ఎంపీపీ మంత్రి బాపు ,మాజీ జెడ్పిటిసి కర్ణ సాగర్ రావు, చెరుకు సర్వోత్తమ్ రెడ్డి, డాక్టర్ రాజా రమేష్, కౌన్సిలర్లు, ఆయా మండలాల ఎంపీటీసీలు, సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.