అడిషనల్ కలెక్టర్ ను కలిసిన చిలప్ చేడ్ ఎంపీపీ వినోద దుర్గారెడ్డి
చిలప్ చేడ్/జులై/జనంసాక్షి :- రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ నుండి లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా నియమితులైన రమేష్ సార్ నీ చిలప్ చేడ్ ఎంపిపి వినోద దుర్గారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి సంబంధించిన రెంట్ బిల్లుల గురించి అడగడం జరిగింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి మండల ప్రజా పరిషత్ నుండి రిపోర్ట్ పంపిస్తే బిల్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వినోద దుర్గారెడ్డి, అనిల్, విష్ణు లు పాల్గొన్నారు..