అడ్డంకులు ఎదురైనా బిజెపి సభను విజయవంతం చేశాం
* ప్రజలను కట్టడి చేసిన జనసంద్రంలా వచ్చారు
* సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు
* మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్
,నర్సాపూర్ . అక్టోబర్, 10, ( జనం సాక్షి )
నర్సాపూర్ లో జరిగిన బిజెపి భారీ బహిరంగ సభతో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులలో భయం పట్టుకుందని మున్సిపల్ చైర్మన్, బిజెపి నాయకులు మురళీధర్ యాదవ్ అన్నారు. సోమవారం నాడు నర్సాపూర్ పట్టణంలో, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, మున్సిపల్ చైర్మన్ బిజెపి నాయకులు మురళీధర్ యాదవ్ మాట్లాడుతూ ,నర్సాపూర్ పట్టణంలో ఈ నెల 9న ,బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ,నిర్వహించిన తన చేరిక సందర్భంగా ,ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు ,ప్రజలు రాకుండా అధికార పార్టీ నాయకులు, ఎన్ని ఇబ్బందులు సృష్టించిన ప్రజలు మాత్రం, స్వచ్ఛందంగా జనసంద్రంలా కదిలి వచ్చి, బిజెపి సభను విజయవంతం చేశారని వారు అన్నారు. బిఆర్ఎస్ అంటే ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, దోచుకోవడం దాచుకోవడం అనే తీరుగా మారడంతో, తెలంగాణ ప్రజలు యువకులు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని వారు అన్నారు. గత 8 సంవత్సరాల కాలంలో, హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్న నర్సాపూర్ పట్టణం మాత్రం, అభివృద్ధిలో వెనుకబడే ఉందని, చెప్పుకోవడం తప్ప చేసిన అభివృద్ధి ఎక్కడ లేదని వారు అన్నారు .నర్సాపూర్ పట్టణంలో జరిగిన బిజెపి భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు అందుకు, సహకరించిన బిజెపి నాయకులకు, ప్రతి ఒక్కరికి ,ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ,మురళీధర్ యాదవ్ అన్నారు .ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బుచ్చేష్ యాదవ్ ,రాజేందర్ , లతా రమేష్ యాదవ్ , సునీత బాల్ రెడ్డి, నాయకులు, కొత్త శ్రీనివాస్ గుప్తా ,మహేందర్, ఆంజనేయులు, సంజీవ ,ఆది లింగం యాదవ్ ,గండి మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.