ఎల్బీ నగర్ (జనం సాక్షి ) బియన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ లో కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి గారు* మరియు జిహెచ్ఎంసి డిఈ దామోదరరావు గారితో కలిసి కాలనీ లో పర్యటించడం జరిగింది.
కాలనీలోని ప్రధాన సమస్యలైన రోడ్లు, మంచినీటి పైప్ లైన్ మరియు డ్రైనేజ్, వీధి దీపాల సమస్యల గురించి కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. స్పందించిన కార్పొరేటర్ అతి త్వరలోనే కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు మెట్టుపల్లి సంతోష్ రెడ్డి, జిహెచ్ఎంసి ఎ ఈ చంద్రశేఖర్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు యాదయ్య, శ్రీదేవి వర్క్ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.





