అత్యాచారానికి పాల్పడిన గ్రామ సర్పంచ్

బషీరాబాద్ అక్టోబర్ 8, (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో నంద్యా నాయక్ తండా గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్ మతిస్థిమితం లేని అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడారని కుటుంబ సభ్యులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.వివరాలలోకి వెళితే ఈ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై అన్వేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని అమ్మాయి నంద్యా నాయక్ తండ గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్ ఇంటికి రాత్రి సుమారు 9 గంటల సమయంలో టీవీ చూడడానికి వెళ్లిన మతిస్థిమితం లేని అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మరియు అన్న కలిసి సర్పంచ్ శంకర్ నాయక్ ఇంటికి వెళ్లగా  అన్నని కొట్టారని కుటుంబ సభ్యులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఉదయం ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు శంకర్ నాయక్ కోసం వెతకడం జరిగింది.శంకర్ నాయక్ పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చేయగా దామర్ చేడ్ గ్రామంలో పోలీసులకు పట్టుబడ్డాడు.పోలీసులు వెంటనే శంకర్ నాయక్ నీ అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్.ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు.