Thursday, 5 November 2026

మునుగోడు ఓటర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహణ — కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.

 ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) మునుగోడు ఓటర్లతో మన్సూరాబాద్ డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి  ఆత్మీయపలకరింపులో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతి బిజెపి కార్యకర్తకు అప్పగించిన భాద్యతలను నెరవేర్చడానికి సైనికుడిగా పని చేయాలని సూచించారు. మన డివిజన్లో మునుగోడు ఓటర్లు అత్యధికంగా ఉన్నారని వారిని సంప్రదించి పూర్తి వివరాలను సేకరించే ప్రణాళికల వ్యూహంలో భాగంగా కమిటీల‌ను నియమించామని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గెలుపునకు సైన్యంలా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్‌ కొత్త రవీందర్ గౌడ్, వివిధ కాలనీ వాసులు, కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.