అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రిమాండ్
బషీరాబాద్ అక్టోబర్ 19, (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కంసాన్పల్లి (బి) అత్యాచారానికి పాల్పడిన చాకలి ముకుందు బుధవారం రోజున రిమాండ్ కు తరలించామని సి.ఐ రాంబాబు,బషీరాబాద్ ఎస్.ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తేదీ 16.10. 2022 నాడు సమయం ఉదయం సుమరు 10:30 గంటలకు కంసాన్పల్లి(బి) గ్రామానికి చెందిన ఒక మహిళ తన కుమారునితో కలిసి తన మేకను గ్రామ శివారులో గల మంగలి నరసప్ప వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తన మేకను మేపుతుండగా అదే గ్రామానికి చెందిన చాకలి ముకుందు ఆమె దగ్గరకు వచ్చి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెను అత్యాచారం చేసినట్లు తన భర్తకు ఫోన్ ద్వారా తెలుపగా భార్యాభర్తలు ఇద్దరు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుని రిమాండ్ కు పంపించారని సి.ఐ రాంబాబు,ఎస్.ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు.