Wednesday, 4 November 2026

అత్యాధునిక యంత్రాలతో అత్యద్భుత వైద్య సేవలు

 

 

 

 

 

  • తొలి ప్రాధాన్యంగా ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు
  • ఇతర ప్రభుత్వ వైద్యశాలల్లో లేని లేజర్‌ చికిత్స విధానం అమలు
  • దేశంలోనే తొలిసారి పిడియాట్రిక్‌ డెర్మటాలజీ శిక్షణా కేంద్రం ఏర్పాటు

బన్సీలాల్‌పేట్‌, మార్చి 4: చర్మ వ్యాధిగ్రస్తులకు గాంధీలో అత్యుత్తమైన చికిత్స అందుతున్నది. నిపుణులైన వైద్యులు రోగులకు సకల సేవలు అందిస్తున్నారు. వైద్యశాలలోని ఔట్‌పేషంట్‌ విభాగంలోని రెండవ అంతస్తులో రూమ్‌ నంబర్‌ 74లో చర్మ, లైంగిక, కుష్ఠువ్యాధుల (డీవీఎల్‌) చికిత్సా విభాగం కొనసాగుతున్నది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు వచ్చే రోగులకు పదకొండు మంది ప్రొఫెసర్లు, ఆరుగురు సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, 26 మంది పీజీ వైద్యవిద్యార్థులు వైద్య సేవలు అందిస్తున్నారు.