Tuesday, 3 November 2026

అదనపు కట్నం కోసం వేధింపులు

వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): అదనం కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక.. పెండ్లి అయిన ఏడు నెలలకే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… ములుగు జిల్లా జాకారం మండల కేంద్రానికి చెందిన సామల కుమారస్వామి కూతురు సుస్మిత(19)ను పీర్జాదిగూడ మల్లికార్జున్‌నగర్‌ కాలనీకి చెందిన కోరయ్య కుమారుడు విజేందర్‌కు ఇచ్చి మేలో వివాహం చేశారు. కాగా.. విజేందర్‌ కొన్ని రోజులు అదనపు కట్నం కావాలని భార్యను వేధిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత రాత్రి బెడ్‌ రూంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసు లు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కాగా.. తన కూతురు మృతికి కారణం అల్లుడి వేధింపులేనని మృతురాలి తల్లిదండ్రు లు పోలీసుకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.