Tuesday, 3 November 2026

అమెరికాలో దారుణం

తెలంగాణ విద్యార్థినిపై అత్యాచారం..హత్య

హైదరాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): అమెరికాలో భారత్‌కు చెందిన టీనేజ్‌ యువతి దారుణంగా హత్యకు గురైంది. యూనివర్సిటీ ఆఫ్‌ ఇలియనాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్‌ జార్జ్‌ను ఆగంతకుడు అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేసినట్లు డాక్టర్లు నిర్దారించారు. నవంబర్‌ 23వ తేదీన ఈ హత్య జరిగింది. రూత్‌ జార్జ్‌ మృతదేహాన్ని యూనివర్సిటీలో ఉన్న గ్యారేజీలో గుర్తించారు. తన కారులోనే యువతి శవమై కనిపించింది. ఈ హత్య కేసులో 26 ఏళ్ల డోనాల్డ్‌ తుర్‌మాన్‌ను దోషిగా తేల్చారు. నిందితుడిపై ఫస్ట్‌ డిగ్రీ మర్డర్‌ కేసును నమోదు చేశారు. లైంగికదాడి కింద కూడా కేసును బుక్‌ చేశారు. రూత్‌ పేరెంట్స్‌ది హైదరాబాద్‌ అని ప్రాథమికంగా తెలుస్తోంది.