Tuesday, 3 November 2026

అధికారమే లక్ష్యంగా బిజెపి పోరు

కామారెడ్డి,జూలై28(జ‌నం సాక్షి): 2019 ఎన్నికల్లో బిజెపిని తెలంగాణలో అధికారంలోకి రావడం లక్ష్యంగా గ్రామస్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి కృషి చేస్తామని జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. కేంద్రంలో మోడీ తీసుకుంటున్న నిర్ణయాలే తమకు శ్రీరామరక్ష అన్నారు. భాజపా సంస్థాగత పటిష్టానికిచర్యలు తీసుకుంటున్నామన్నారు.బూత్‌స్థాయిలో కార్యకర్తల ద్వారా పార్టీని బలోపేతం చేస్తామన్నారు.తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్రం అంతటా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు, రెండు పడకగదుల పథకం, రైతు సమస్యలపై పోరాటాలు చేస్తామని అన్నారు. ఇతర పార్టీల నేతల చేరికల కంటే అంతర్గతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామని అన్నారు. .