ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారు : కేశవ్‌

అనంతపురం,జూలై28(జ‌నం సాక్షి): ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డికి రాజకీయం తప్ప అభివృద్ధి పట్టదని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అన్నారు. కేవలం టిడిపి చేస్తున్న అభివృద్ది కారణంగానే ప్రజలు తమవైపు ఉన్నారని అన్నారు. ఎపి ప్రజలు అభివృద్ది కామకులని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై జగన్‌కు ఏ మాత్రం గౌరవం లేదన్న విషయం ఇటీవలి ఘటనలతో తెలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్‌ తన బ్లాక్‌మెయిలింగ్‌ విధానాన్ని మార్చుకోవాలని వర్ల సూచించారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఎపి ప్రయోజనాల విషయంలో సిఎం చంద్రబాబు ఏనాడూ రాజీపడలేదన్నారు. ప్రత్యేక ¬దాపై అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎంఉకు చట్టంలో పెట్టలేదో కాంగ్రెస్‌ నేతలు సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు.

 

తాజావార్తలు