Tuesday, 3 November 2026

అధికారి ఇంట్లో సోదాలు.. కేజీల్లో బంగారం

41482033685_625x300హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కె.ఎల్.భాస్కర్‌కు సంబంధించిన ఇళ్లలో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగాయి. హైదరాబాద్ సీతాఫల్‌మండిలోని హార్మోని హైట్స్‌లో ఉన్న ఇంట్లో 3 కేజీల బంగారం, 15 కేజీల వెండి, ఏపీ, తెలంగాణల్లోని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్‌ను అరెస్టు చేసి విశాఖపట్నంకు తరలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *