Tuesday, 3 November 2026

అధికారులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు : ఎమ్మెల్యే భేతి

రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు, అలాగే రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు ఉండే సూచన ఉండడంతో
నాచారం డివిజన్లోని రెండు చెరువులు ఒకటి పటేల్ కుంట చెరువు, రెండవది హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువులను  కలిపే నాలా ను ఉప్పల్ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి,  నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ లు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ
చెరువులో నుంచి తీసిన వ్యర్ధాలను తక్షణమే తొలగించాలని అధికారులకు సూచించారు.
నాచారం పెద్దనాలాలోని పూడిక ఇప్పటివరకు కూడా తొలగించినందుకు అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే  ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరిలాల్,  డిప్యూటీ ఇంజనీర్ రూపా,  అసిస్టెంట్ ఇంజనీర్ లింగారావు, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్,  శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు , అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రమేష్,  నాచారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యంరెడ్డి,  సాయి జెన్ శేఖర్ ,కట్ట బుచ్చన్న గౌడ్, కాటేపల్లి రవీందర్ రెడ్డి ,విటల్ యాదవ్, దాసరి కర్ణ ,రెబల్ రాజు ,రామచందర్, శ్రీరామ్ సత్యనారాయణ ,అశోక్ ,దేవులపల్లి యాదగిరి, చంద్రశేఖర్ ,వాసు ,తిరుమల్, శివ ,అనిల్, రవి ,కిట్టు తదితరులు పాల్గొన్నారు.v