నాంపల్లి అక్టోబర్ 8 (జనం సాక్షి )ప్రజలకు ఆహ్లాదాని పెంచేందుకు ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి మొక్కలను పెంచాలని, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం లో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని ఆగస్టు నెలలో ఐదో విడత మొక్కలను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టింది. నాంపల్లి మండలం దేవత్ పల్లి గ్రామంలో నెల రోజులు దాటినా రహదారులకు ఇరువైపులా నాటవలసిన మొక్కలను స్థానిక పల్లె ప్రగతి క్షేత్రంలో కుప్పలు,కుప్పలుగా పోసి ఇంతవరకు మొక్కలు నాటే లేదని, అవి ఎండిపోయాయి అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చేసుకొని సర్పంచ్, కార్యదర్శి లపై చర్యలు తీసుకొని రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటిన చాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే మొక్కలు ఎండి పోయాయన గ్రామస్తులు




