గంగారం ఆగస్టు 1 (జరం సాక్షి)
గంగారం మండలంలోని దుబ్బగూడెం గ్రామపంచాయతీ మామిడిగూడెం గ్రామంలో శనివారం కురిసిన వానకి గోగు రామకృష్ణ,మౌనిక దంపతుల 20 గుంటల పొలం వరదకి కొట్టుకుపోయింది.చెరువుకి తూము తెగిపోయి చాలాకాలం అవుతుంది వాన ఎక్కువగా పడటంతో చెరువు అలుగు మొత్తం తమ నాటు వేసిన పొలం పై నుండి వెళ్లడం తో మొత్తం గండ్లు పడి కొట్టుకుపోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేసారు దీనిపై సంబంధిత అధికారులు వెంటనే స్పందిచి చెరువు తూముకు మరమ్మతులు చేయాలనీ వారు డిమాండ్ చేసారు.తూము ఇలాగె ఉంటె భవిష్యత్తులో మరింత నష్టం జరిగే అవకాశం ఉంది.మిషన్ కాకతీయ లో భాగంగా చెరువు మరమ్మతులు నాసిరకంగా చేయడం వల్లనే ఇలాంటి వరద నష్టం జరుగుతుంది. తక్షణమే ఉన్నతాధికారులు తీసుకొని మన మత్తు చేయించాలని నష్టపరిహారం కింద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని కోరారు




