మల్కాజగిరి.జనంసాక్షి.ఆగస్టు1
మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని బిజేపి మల్కాజి గిరి అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ ముదిరాజ్ అధికారులను డిమాండ్ చేశారు.సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రి సమస్యల వలయంగా మారిందని,ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని,ఒక ఆసుపత్రికి ఉండాల్సిన మౌలిక సదుపాయాలు కూడ ఇక్కడ లేవని ఆరోపించారు.కొన్ని సందర్బాలలో అత్యవసర సేవలు పని చేయడం లేదని,నిలదీసిన రోగుల బందువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులు,సిబ్బంది తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.రోగులకు మందులు నామ మాత్రంగానే ఇస్తున్నారని ఆరోపించారు.ముఖ్యంగా జిల్లా ఆసుపత్రిలో 50 పడుకలు మాత్రమే ఉన్నాయని, వెంటనే యుద్ద ప్రాతిపదికన 300 పడకలకు పెంచాలని డిమాండ్ చేశారు.అంతేగాక ఆసుపత్రిని పట్టి పీడిస్తున్న సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మహిళా మోర్చ్ జిల్లా అధ్యక్షురాలు శిల్పారెడ్డి,అర్ కే శ్రీనివాస్,నరహరి,తేజ,ధనరాజ్, హనుమంతరావు,ప్రసన్న,నాగరాజ్, సోమ శ్రీనివాస్,లక్ష్మణ్ గౌడ్,చందు, శంకర్ రావు,రాకేష్,అంజలి,దేవి,సుశీల,
జ్యోతిర్మయి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




