హైదరాబాద్,జూన్2(జనంసాక్షి): తెలంగాణలో ఉంటే టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు,ఎంపిలే ఉండాలని కోరుకోవడం సరికాదని తెలంగాణ బిజెపి నాయకుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపిలను చేర్చుకోవడం ద్వారానే అభివృద్ది సాగుతుందని చెప్పడం కూడా ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. ప్రతిపక్ష సభ్యులను ప్రలోభ పెట్టి చేర్చుకోవడం ప్రారంభించింది తెరాసనే అని ఆరోపించారు. బలం లేకున్నా అదనపు అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలపడం తెరాసకు ఎంతవరకు నైతికతని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయడం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, ఎంఐఎం తప్ప ఏ పార్టీ మిగలదన్న రీతిలో కేసీఆర్ నిరంకుశ వైఖరితో ఉన్నారని అన్నారు. కేసీఆర్ ఇకనైనా తనపద్దతి మార్చుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాలా కలిసి పనిచేయాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సాయం చేస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు కొనసాగించే విషయంలో భవిష్యత్తు గురించి తమ జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు.




