Monday, 2 November 2026

హైదరాబాద్‌లో చల్లబడ్డ వాతావరణం

హైదరాబాద్‌,జూన్‌2(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది, గత కొన్నిరోజులతో పోలిస్తూ చలిగాలులుమొదలయ్యాయి. గురువారం తెల్లవారుజామున కూడా అక్కడక్కడా స్వల్పంగా జల్లులు పడ్డాయి.  ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు విూదుగా ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలో వచ్చే 2 రోజులు ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చ రించింది. రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఎండలు మండిపోయాయి. మరోవైపు క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో రాగల 24 గంటల్లో హైదరాబాద్‌లో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జడివాన కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.   కడప, అనంతపురం జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు  చెరువులు, కుంటలు అన్నీ నిండిపోయాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి.   భానుడి ప్రతాపంతో మండిపోతోన్న హైదరా బాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అవిూర్‌పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌ సహా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్లు జలమయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *