హైదరాబాద్ : అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో శాసనసభదద్ధరిల్లింది. కళంకిత మంత్రులపై తెదేపా చేసిన వ్యాఖ్యలను సీఎం, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తిప్పి కొట్టారు. రాజకీయంగా ఎదుర్కొనే ధెర్యం లేకనే తనపై అసత్య అరోపణలు చేస్తున్నారని కన్నా ఆవేశంగా ప్రసంగించారు. తనపై వచ్చిన అభియోగాలు అవాస్తవమని ఖండించారు. తెలుగుదేశం పార్టీలో దొంగలున్నారంటూ కన్నా చేసిన వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది. తెదేపా సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.




