అధిష్టానం ఆశీర్వదిస్తే సిరిసిల్ల నుంచి పోటీ చేస్తా

 

సంగీతం శ్రీనివాస్ కాంగ్రెస్ ఎన్నికల క్యాంపెయిన్ సభ్యులు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 23.,(జనంసాక్షి). కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం ఆశీర్వదిస్తే సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రచార క్యాంపెయిన్ సభ్యులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా పనిచేస్తున్న కాలంలో తనకు సహకరించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నుండి ఎన్నికల ప్రచార క్యాంపెయిన్ సభ్యులుగా తాను ఎన్నికైనట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అందించిన సంక్షేమ పథకాలు, పార్టీ ప్రజల కోసం చేయనున్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఎన్నికల క్యాంపెయిన్ సభ్యుడిగా అవకాశం కల్పించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ ఎస్ యు ఐ నుండి యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ దాకా కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి పనిచేశానాని తెలిపారు. బీసీ సామాజిక వర్గం నుండి తాను అందించిన సేవలను గుర్తించి తనకు సిరిసిల్ల నియోజకవర్గం నుండి అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అధిష్టానం ఆశీర్వదిస్తే తాను సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారని స్పష్టం చేశారు. సమావేశంలో మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సూర దేవరాజు, చొప్పదండి ప్రకాష్, వెంగళ అశోక్, చిదం శ్రీనివాస్, అన్నం సతీష్ రెడ్డి, రెడ్డిమల్ల భాను, తదితరులు పాల్గొన్నారు.