అధైర్య పడొద్దు అన్ని విధాలా అండగా నిలుస్తాము, జడ్పీటిసి నారోజి గంగారాం

రుద్రూర్ (జనంసాక్షి):
అధైర్య పడొద్దని అన్ని విధాలా అండగా నిలుస్తామని ఇల్లు కూలిన బాధితులకు జడ్పీటిసి నారోజి గంగారాం ఆధ్వర్యంలో వెల్లన బిఆర్ ఏస్ మండల నాయకులు, మండల అధికారులు బాధితులకు
భరోసా కల్పించారు.గత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని ఇల్లు కూలిన బాధితులకు దగ్గరకి వెళ్ళి వారిని పరామర్శించారు, వారికిఉండటానికి ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసారు,అర్హులైన వారికి ప్రభుత్వం నుండి వచ్చే గృహపథకాల ద్వారా లబ్ధి పొందేలా చేస్తామని అన్నారు, తమ నాయకుడు పేదల పెన్నిధి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉండగా నియోజకవర్గ ప్రజలు అధైర్య పడొద్దని తెలిపారు, అంతేకాకుండా బాధితులకు మేలు జరిగేలా మండల అధికారులకు తగు సూచనలు చేశారు, ఈ కార్యక్రమంలో జడ్పీటిసి నారోజి గంగారాం, ఎంపిడిఓ బాలగంగాధర్, తహసిల్దార్ ముజిబ్, చిక్కడపల్లి సర్పంచ్ పుష్పాలత రమేష్ , సిద్దాపూర్ సర్పంచ్ లక్ష్మణ్, ఆయా గ్రామాల వార్డు మెంబర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు